ప్రణయ్ కి వేరే అమ్మాయిలతో సంబంధాలు లేవు: అమృత

  • ప్రణయ్ గురించి తెరపైకి వస్తున్న కొత్త విషయాలు
  • ప్రణయ్ ఓ రోమియో అంటూ ప్రచారం
  • స్నేహితులతో మాట్లాడినంత మాత్రాన రోమియో అంటారా అంటూ అమృత ఆవేదన
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ పరువు హత్య ఉదంతం ఇరు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి జనాలు రెండు వర్గాలుగా చీలిపోయి చర్చ జరుపుతున్నారు. కొందరు ఈ హత్యను కుల వివక్షతో ముడిపెట్టి మాట్లాడుతుండగా... మరికొందరు అల్లారు ముద్దుగా పెంచి, పెద్ద చేసిన కన్న తండ్రిని మోసం చేశారనే విధంగా మాట్లాడుతున్నారు.

ఈ అంశాన్ని పక్కన పెడితే... ప్రణయ్ గురించి సోషల్ మీడియాలో పలు విషయాలను కొందరు ప్రస్తావిస్తున్నారు. ప్రణయ్ ఒక రోమియో అని... తొమ్మిదవ తరగతిలోనే అమృతను ప్రేమించిన ప్రణయ్ కు వేరే అమ్మాయిలతో కూడా సంబంధాలు ఉన్నాయంటూ సరికొత్త చర్చకు తెరతీశారు. ఇదే అంశాన్ని ఓ మీడియా ఛానల్ అమృత వద్ద ప్రస్తావించింది.

దీనికి సమాధానంగా అమృత మాట్లాడుతూ, ప్రణయ్ ఉన్నది తనతో, అతని తల్లిదండ్రులతో అని... తనకు తెలియని విషయాలు బయటివారికి ఎలా తెలుస్తాయని ప్రశ్నించింది. కాలేజ్ ఫ్రెండ్స్ తో మాట్లాడటం సాధారణంగా జరిగేదేనని... తన ఫ్రెండ్స్ తో తాను కూడా మాట్లాడతానని... ఇందులో తప్పేముందని అడిగింది. ఒక అమ్మాయితో మాట్లాడినంత మాత్రాన రోమియో అనడం సరికాదని చెప్పింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది. 
Go Back to Shorts
pranay
amrutha
romeo
honour killing

More Telugu News